పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య

by Nagaya |
పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో హోంగార్డుగా పనిచేస్తున్న నూర్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రిమ్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని జైత్రం తండా గ్రామానికి చెందిన నూర్ సింగ్ ఇంద్రవెల్లిలో హోంగార్డుగా పనిచేస్తున్నారని అన్నారు. గత కొంతకాలంగా హోంగార్డుగా పనిచేస్తున్న నూర్ సింగ్ ఉన్నట్టుండి ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి 108 లో తరలించగా పరీక్షించి నూర్ సింగ్ మార్గమధ్యలోనే మృతి చెందినట్లు రిమ్స్ వైద్యులు వెల్లడించారు.

హోంగార్డు నూర్ సింగ్ మృతి విషయం తెలుసుకున్న టూ టౌన్ సీఐ అశోక్, హోంగార్డు మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంద్రవెల్లి ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మార్చరికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed