పాన్ ఇండియా లెవల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు: హీరో నవదీప్

by GSrikanth |
పాన్ ఇండియా లెవల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు: హీరో నవదీప్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల విచారణ ముగిసింది. శనివారం ఉదయం విచారణకు హాజరైన నవదీప్‌ను నర్సింగరావు, సునీతారెడ్డి నేతృత్వంలో అధికారులు సుమారు 6 గంటల పాటు విచారించారు. డ్రగ్స్ కేసులో దేవరకొండ సురేష్, రామచంద్రతో పరిచయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. పాన్ ఇండియా లెవల్లో ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పారు. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు అందడంతోనే విచారణకు వచ్చాన్నారు. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీమ్ బాగా పని చేస్తోందని ఏడేళ్ల క్రితం నాటి ఫోన్ కాల్స్ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారని చెప్పారు.

గతంలో ఒక పబ్ బిజినెస్‌లో తన ప్రమేయం ఉండటం వల్ల గతంలోనూ సిట్, ఈడీ తనను విచారించిందని తాజాగా మరోసారి అధికారుల వద్ద ఉన్న సమాచారం మేరకు తనను పిలిచి విచారించారని చెప్పారు. అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని అవసరం అంటే మళ్లీ పిలుస్తామన్నారని చెప్పారు. కాగా, ఇవాళ్టి విచారణలో కాల్ లిస్ట్ ముందుంచి నవదీప్‌ను విచారించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వాట్సాప్ చాటింగ్‌ను రిట్రీవ్ చేసి ఆ డేటా ప్రకారం మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ, వ్యాపారాలు, బిజినెస్ వివరాలపై ఆరా తీయగా కొన్ని ప్రశ్నలకు నవదీప్ సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story