నెంబర్ ప్లేట్ ‌లేని బైకుతో వచ్చి కిడ్నాప్‌కు యత్నం

by GSrikanth |
నెంబర్ ప్లేట్ ‌లేని బైకుతో వచ్చి కిడ్నాప్‌కు యత్నం
X

దిశ, కోరుట్ల టౌన్: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని సాయిరాం పురా కాలనీలో గుర్తు తెలియని వ్యక్తుల సంచారం కలకలం రేపింది. ఆదివారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై కాలనీకి వచ్చారు. అడ్రస్ చెప్పాలని ఇద్దర పిల్లలను బైకు ఎక్కించుకున్నారు. అక్కడే ఉన్న కొందరు గమనించి ‘ఎవరు మీరు’ అని ప్రశ్నించారు. కాలనీ వాసులంతా గుమిగూడటంతో పిల్లల్ని వాహనం దింపి ఒక్కసారిగా అక్కడినుంచి పరుగులు తీశారు. దీంతో వారు కిడ్నాప్‌కు యత్నించారని భావించారు. అప్రమత్తంగా ఉండటంతో పిల్లలను కాపాడుకోగలిగామని స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed