అత్తగారింటికి వెళ్తూ అనంతలోకాలకు

by Sridhar Babu |
అత్తగారింటికి వెళ్తూ అనంతలోకాలకు
X

దిశ, కోటగిరి : మద్యం మత్తులో పంట కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఉదయం పొలాలకు వెళ్లే రైతులు పంట కాలువలో వ్యక్తి పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాలు ప్రకారం పాత బాన్సువాడకు చెందిన సాయిరాం(40) అనే వ్యక్తి సంసారం విషయంలో తన భార్య విజయతో గొడవ పడడంతో ఆమె తన పుట్టిల్లు ఎత్తోండ గ్రామానికి వెళ్లిపోయింది. దాంతో బుధవారం రాత్రి మద్యం తాగి తన భార్య విజయకు ఫోన్ చేసి ఎత్తోండకు వస్తున్నానని చెప్పాడు. గురువారం ఉదయం ఎత్తోండ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి ఊపిరాడక చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story