good thief : దొంగల్లో ఈ దొంగ వేయరా...!

by Sridhar Babu |
good thief : దొంగల్లో ఈ దొంగ వేయరా...!
X

దిశ,మహేశ్వరం : ఓ హోటల్లో చోరీ చేసేందుకు సిద్దమైన ఓ దొంగ పోలీసులకు కనీసం ఒక్క ఆధారం కూడా దొరకకుండా ఎంతో జాగ్రత్తగా ప్లాన్ వేశాడు. చేతులకు బ్లౌజ్లు, ముఖానికి మంకీక్యాప్ ధరించి తాను ఎంచుకున్న స్పాట్ వద్దకు చేరుకుని తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లాడు. హోటల్ లో యాజమానులు ఒక్క రూపాయి కూడా పెట్టకపోవడంతో నిరాశ చెందాడు. దీంతో పక్కనే ఉన్న ఫ్రీడ్జ్ లో నుంచి సీల్​ వాటర్ బాటిల్ దొంగిలించాడు.

హోటల్​ యజమాని చాలా దీన స్థితిలో ఉన్నాడని భావించాడో ఏమీ కానీ బయటకు వెళ్లి తిరిగి హోటల్ లోకి వచ్చి 20 రూపాయలు నోటును టేబుల్ పై పెట్టి వెళ్లాడు. ఈ దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా చకర్లు కొడుతుంది. ఈ ఘటన మహేశ్వరం మండల కేంద్రంలోని వినాయక మెస్ హోటల్ లో జరిగింది.



Next Story