- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్‌కు బిగ్ షాక్.. ఇక తప్పించుకోవడం కష్టమే!
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్ వీడియోలతో కొందరికి తెలిసిన అతను.. బిగ్‌బాస్‌తో అందరికీ చేరువయ్యాడు. ఇటీవల సాంగ్స్ షూట్స్‌తో పాటు పలు ఈవెంట్స్‌లోనూ పాల్గొంటున్నాడు. ప్రస్తుతం షణ్ముక్ చిక్కుల్లో పడ్డారు. మౌనిక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముక్ ఇంట్లో పోలీసులు గురువారం తనిఖీలు చేశారు. దీంతో వారి వద్ద గంజాయి లభ్యమైంది. అరెస్ట్ చేసి టెస్టులు చేయగా.. అతడు గంజాయి వాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో షణ్ముక్‌పై కేసు నమోదు చేయడంతో పాటు అతడికి జైలు శిక్ష పడే అవాకాశాలు కన్పిస్తున్నాయి. షణ్ముక్‌తో పాటు అతడి సోదరుడు కూడా సంపత్ వినయ్ కూడా అరెస్ట్ అయ్యాడు.
కాగా, సంపత్ వినయ్ కొంత కాలంగా మౌనిక అనే అమ్మాయితో లవ్ ఉన్నారు. ఆమెతో సన్నిహతంగా గడిపాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత పెళ్లికి మొఖం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంపత్ వినయ్ కోసం జశ్వంత్ ప్లాట్ వెళ్లారు. అక్కడ పోలీసులకు అనుమానం వచ్చి సోదాలు చేశారు. సోదాల్లో గంజాయ్ గుర్తించారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం బయటపడింది.