- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంతానం లేదని వ్యక్తి ఆత్మహత్య
దిశ, తాండూరు : సంతానం లేక మానసికంగా బాధపడుతూ మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం తాండూరు మండలంలో చోటుచేసుకుంది. కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలం జిన్గూర్తి గ్రామానికి చెందిన ఒలిగిరి కృష్ణ కుమార్ (30) అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి సంతానం లేదు. ఇటీవల డ్రైవర్ పని వదిలివేసి మద్యానికి అలవాటు పడ్డాడు. రాఖీ పండుగ సందర్భంగా మృతుడి భార్య సావిత్రి తన పుట్టింటికి పెద్దేముల్ మండలం బుద్ధారం గ్రామానికి వెళ్లింది.
దాంతో పురుగుల మందు తాగి తాను చనిపోతున్నానని గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో ఆ వ్యక్తి మృతుడి తల్లికి తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకొని చికిత్స కోసం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు.
- Tags
- suicide