BREAKING: క్వారీలో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు కూలీలు దుర్మరణం

by Shiva |
BREAKING: క్వారీలో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు కూలీలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: క్వారీలో బండరాళ్లు కూలడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కంచికచర్ల మండల పరిధిలోని పరిటాలలో బండరాళ్ల క్వారీలో పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రోజులాగానే సోమవారం ఉదయం కొంతమంది కార్మికులు క్వారీలో డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా బండరాళ్లు వాళ్లపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు రాళ్ల కింద పడి నిలిగిపోవడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా మరో ముగ్గురు బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయారు. గమనించిన తోటి కార్మికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న వారు రాళ్ల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకునిమృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story