కారు ఢీకొని వృద్ధురాలు మృతి

by Kalyani |
కారు ఢీకొని వృద్ధురాలు మృతి
X

దిశ, చారకొండ: మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మెడమోని నర్సమ్మ (60)కారు ఢీకొని మృతి చెందింది.స్థానిక ఎస్సై ఎన్.రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మెడమోని నర్సమ్మ సాయంత్రం ఏడు గంటలకు రోడ్డు దాటుతున్న సమయంలో కల్వకుర్తి నుండి దేవరకొండ వైపు వేగంగా వచ్చిన షీఫ్ట డిజార్డర్ కారు (టీఎస్.31ఈ 0207)ఢీ కొనడంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందిందనీ ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించామని ,మృతురాలి కుమారుడు కొండల్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్.రాజశేఖర్ తెలిపారు.

Advertisement

Next Story