వెయ్యి రూపాయల కోసం మహిళకు ఉరి..

by Sumithra |
వెయ్యి రూపాయల కోసం మహిళకు ఉరి..
X

దిశ, గాంధారి : సమాజంలో మనిషి రోజురోజుకు ఎంత దిగజారుతున్నాడు అనేది ఈ ఒక్క ఉదాహరణ చాలు. కేవలం 1000 రూపాయల కోసమని మహిళకు ఉరితాడు వేసి చంపాలని చూసిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రం పెద్ద పోతంగల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద పోతంగల్ గ్రామానికి చెందిన గైని భూమవ్వ అనే మహిళ అదే గ్రామానికి చెందిన విట్టల్ భూమవ్వకు మాయమాటలు చెప్పి విట్టల్ ఇంటికి తీసుకెళ్లి ఆమె దగ్గర ఉన్న 1000 రూపాయలు లాక్కొని భూమవ్వను చంపడానికి అతని ఇంట్లో తాడుతో ఊరిపెట్టగా ఆమె గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఆమెను కాపాడి ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని కూడా లాక్కోవాలని ప్రయత్నించినట్లు ఎస్సై తెలిపారు. అయితే భూమవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed