ఇంటి కప్పు కూలి మహిళ మృతి..

by Sumithra |
ఇంటి కప్పు కూలి మహిళ మృతి..
X

దిశ, టేక్మాల్ : మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న ఇంటి కప్పు శనివారం రాత్రి కూలిపోవడంతో అక్కడే పడుకున్న మంగలి శంకరమ్మ (63) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.

విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 2 లక్షల 11 వేలు అందజేశారు.ప్రభుత్వపరంగా బాధిత ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పురాతన ఇండ్లు, భారీ వర్షాలకు దెబ్బతిన్న గృహాలలో ఉండే వారు వేరే గృహాల్లో నివాసం ఉండాలని, చెరువులో చాపల వేటకు వెళ్లకూడదని, వర్షంలో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని మంత్రి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed