ప్రమాదవశాత్తు వాగులో పడి మహిళ మృతి

by Sridhar Babu |
ప్రమాదవశాత్తు వాగులో పడి మహిళ మృతి
X

దిశ,బోథ్ : బోథ్ మండల కేంద్రంలోని పెద్దవాగు శివారులో బట్టలు ఉతకడానికి వెళ్లిన రజక కులానికి చెందిన మహిళ వోడ్నాల పోసాని(50) ప్రమాదవశాత్తు వాగులో మునిగిపోయి మృతి చెందింది. బంధువులు, రజకుల సహాయంతో స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. దోభీ ఘాట్ లేకపోవడం వల్లే ప్రమాదవశాత్తు మహిళ చనిపోయిందని, వెంటనే దోభీ ఘాటు నిర్మించాలని రజకులు ఆందోళనకు దిగారు. గతంలో పలు సంఘటనలు జరిగినప్పటికీ అధికారులు, నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు.

స్పష్టమైన హామీ వచ్చే వరకు శవాన్ని కదిలించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని రజకులతో ఆయన మాట్లాడారు. వెంటనే దోభీ ఘాట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, అలాగే బట్టలు ఉతికే రజకులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రజకులు ఆందోళన విరమించారు. తక్షణ సహాయం కింద ఎమ్మెల్యే అనిల్ మృతురాలు కుమారునికి రూ.10 వేలు అందించారు.

Next Story