హాస్టల్ మరుగుదొడ్లో ప్రసవించిన విద్యార్థిని

by Bhoopathi Nagaiah |
హాస్టల్ మరుగుదొడ్లో ప్రసవించిన విద్యార్థిని
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొత్తపట్నం మండలంలోని ఓ కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్ బాత్రూంలో ప్రసవించింది. అయితే పుట్టిన పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల హాస్టల్ సిబ్బంది వెంటనే DEO సుభద్రకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న డీఈవో హుటాహుటిన పాఠశాలకు చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. విద్యార్థినిని ఒంగోలులోని సర్వజన ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.

బాలికను లైంగికంగా లొంగదీసుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలిక ఓ కస్తూర్బా పాఠశాలలో రెండు నెలల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుందని పాఠశాల అధికారులు తెలిపారు. విద్యాలయంలో చేరినప్పుడే బాలికకు గర్భం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నామని, విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed