ఆలయాలపైన దొంగల కన్ను.. దేవుళ్ళ గుళ్లకు భద్రత కరువు

by Sumithra |
ఆలయాలపైన దొంగల కన్ను.. దేవుళ్ళ గుళ్లకు భద్రత కరువు
X

దిశ, మద్దూరు : దొంగలు దేవుడి ఆలయాల పై కన్నువేసి వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో పెద్దమ్మ గుడిలో జరిగిన దొంగతనం మరువక ముందే, మద్దూరు మండలం సలాఖపుర్ గ్రామంలోని బీరప్ప దేవాలయంలో శనివారం రాత్రి దొంగతనం ఒరిగినట్లు కురుమసంగం సబ్యులు తెలిపారు. గేటు తాళాలు పగులగొట్టి గుడిలో వున్న హుండీని పగులగొట్టి దాదాపు మూడు లక్ష రూపాయలు. మూడు పట్టు చీరలు, వెండి మానిక్యాలు దొంగతనం జరిగినట్లు తెలిపారు.

ఆదివారం పోలీసులకు సమాచారం అందించడంతో మద్దూరు ఎస్సై షేక్ మహబూబ్ దొంగతనం జరిగిన తీరును పరిశీలించి విచారణ జరిపినట్లు తెలిపారు. దేవాలయాల పై వరుస దొంగతనాలు జరుగుతున్న పోలీసులు భద్రత కల్పించడంలో విఫలం అవుతున్నారని, దేవుడి ఆలయాల పై వరుస దొంగతనాలు జరుగుతుండడంతో దేవుడి గుళ్ళకే రక్షణ లేదంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. నేరస్తులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని భక్తులు అనుకుంటున్నారు. మరోవైపు దేవాలయాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దేవాలయాల దొంగలను పట్టుకొని దేవాలయాలకు భద్రత కల్పించాలిని భక్తులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed