- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కొడుకు.. కిరాతకంగా కొట్టిచంపిన తండ్రి
by GSrikanth |
X
దిశ, చిన్నశంకరంపేట: ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కారణంగా చోటుచేసుకుంటున్న దారుణాలకు హద్దే లేకుండా పోతోంది. కొందరు మితిమీరిన అప్పులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా.. మరికొందరు కుటుంబాలను రోడ్డుమీదకు లాగేస్తున్నారు. తాజాగా సరిగ్గా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట బరిగాత్‌పెల్లికి చెందిన ముఖేశ్ కుమార్(28) అనే యువకుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో భారీగా బెట్టింగులకు పాల్పడ్డారు. లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా రూ.2 కోట్లు బెట్టింగ్‌లో పోగొట్టారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి సత్యనారాయణ(రైల్వే ఉద్యోగి) కుమారుడు ముఖేష్‌ను గట్టిగా మందలించాడు. ఎంతకీ వినకపోవడంతో విసుగెత్తి ముఖేష్ నిద్రిస్తున్న సమయంలో ఐరన్ రాడ్‌తో తలపై కిరాతకంగా కొట్టి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story