వాహన తనిఖీల్లో..ఏడు లక్షల నగదు సీజ్

by Jakkula Mamatha |
వాహన తనిఖీల్లో..ఏడు లక్షల నగదు సీజ్
X

దిశ,జంగారెడ్డిగూడెం:ఏలూరు జిల్లాలో స్టాటిక్ సర్వైలెన్స్ టీం (ఎస్ఎస్టీ) విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. జిల్లాలో పలు చోట్ల భారీగా నగదు మొత్తాలను చెక్ పోస్టుల వద్ద స్వాధీనం చేసుకున్నారు. తాజాగా జంగారెడ్డిగూడెంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి వేగవరం బైపాస్ లో ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేశారు. టు వీలర్ లో తరలిస్తున్న సుమారు ఏడు లక్షల రూపాయల ను స్వాధీనం చేసుకున్నారు. వేగవరం నుంచి జంగారెడ్డిగూడెం వైపు ద్విచక్ర వాహనంలో నగదు తరలిస్తుండగా పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎటువంటి బిల్స్ ఆధారాలు లేకపోవడంతో నగదు సీజ్ చేసి ట్రెజరీకి తరలించామని అధికారులు తెలిపారు. తనిఖీలలో ఎస్ఎస్టీ టీం, ఎంపీడీవో, జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బసు పాల్గొన్నారు.

Advertisement
Next Story