బిగ్ బాస్ అమర్ దీప్‌పై దాడి.. కంటెస్టెంట్స్ కార్లు ధ్వంసం.. అసలేం జరిగిందంటే..?

by Prasanna |
బిగ్ బాస్ అమర్ దీప్‌పై దాడి.. కంటెస్టెంట్స్ కార్లు ధ్వంసం.. అసలేం జరిగిందంటే..?
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా.. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. షూటింగ్ అయిన తరువాత అమర్ దీప్‌తో పాటు కంటెస్టెంట్స్ అంతా వరుసగా బయటకు వస్తారనే ముందే సమాచారం ఉండటంతో.. అన్నపూర్ణ స్టుడియోస్ గేటు వద్దే వేలాది మంది కాపలాకాచారు. అమర్ దీప్‌ని అతని ఫ్యామిలీని తరిమితరిమి కొట్టారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. దాదాపు అరగంట పాటు.. కారులోనే ఉండిపోయిన అమర్ దీప్‌ని అతని ఫ్యామిలీని వెంటాడి దాడి చేసి.. వాళ్లని భయభ్రాంతుల్ని చేశారు. అమర్ దీప్ కారులో ఉన్నాడని తెలుసుకున్న అల్లరి మూకల గుంపు ఒక్కసారిగా అమర్ దీప్‌పై దాడి చేసింది. అమర్ దీప్ చేయరాని నేరం ఘోరం చేసినట్టుగా.. అతన్ని పచ్చి బూతులు తిడుతూ.. కారులో ఉన్న అమర్ దీప్‌ని అతని భార్యని బూతులు తిడుతూ సైకోలుగా బిహేవ్ చేశారు. వదిలేయండని అమర్ తల్లి.. స్నేహితుడు వేడుకున్న వినలేదు. కారుని పూర్తిగా ధ్వసం చేశారు. ఈ దాడిలో కారులో ఉన్న అమర్ దీప్‌కి అతని తల్లి, భార్యకి గాయాలయ్యాయి.

కేవలం అమర్ దీప్ కారుపైనే కాకుండా.. మిగిలిన కంటెస్టెంట్స్ కారుతో పాటు.. యాంకర్ గీతు రాయల్ కారుపై కూడా దాడి చేశారు.పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్ ఫ్యాన్స్ ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు. రోడ్డుపై వెళ్తున్న బస్సు అద్దాలను బద్దలకు కొట్టి.. విధ్వంసం సృష్టించారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని వారిని చెదరగొట్టారు.

Advertisement

Next Story