- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెల్లివిరిసిన మత సామరస్యం.. ప్రాణ ప్రతిష్ట రోజున పుట్టిన శిశువుకు రాముడి పేరు పెట్టిన ముస్లిం దంపతులు.. ఎక్కడంటే?
దిశ, వెబ్‌డెస్క్: 500 ఏళ్ల నాటి హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా ముగిసింది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వేద మంత్రాల నడుమ, శ్రీరామ నామ పరాయణంతో అద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. దేశంలోని ప్రజలు కుల, మత విబేధాలు లేకుండా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించి బాల రాముడి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులు జనవరి 22నే ప్రసవం చేయించుకునేందుకు ఆసుపత్రుల్లో చేరారు.
ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజాబాద్‌కు చెందిన మస్లిం కుటుంబం మతసామరస్యాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సరిగ్గా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుండగా ఫర్జానా అనే మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పిల్లాడి బామ్మ హుస్నా తన మనవడికి హిందూ, ముస్లిం ఐక్యతను సూచించేలా ‘రామ్ రహీమ్’ అని పేరు పెట్టింది. అదేవిధంగా జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా మంచి రోజు కావడంతో ఒకే రోజున వేలల్లో ప్రసవాలు జరిగనట్లుగా తెలుస్తోంది.
ముస్లిం శిశువుకు రాముడి పేరు
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2024
ఉత్తరప్రదేశ్ - ఫిరోజాబాద్‌లో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఫర్జానా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది.. హిందూ-ముస్లిం ఐక్యతను సూచించేలా శిశువు బామ్మ హుస్నా బాను తన మనవడికి రామ్ రహీమ్ అని పేరు పెట్టింది. pic.twitter.com/Zj7AZjkB3t