- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రామమందిర ప్రారంభోత్సవం మోడీ ఫంక్షన్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
by samatah |

X
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం మోడీ ఫంక్షన్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా నాగాలాండ్ రాజధాని కొహిమాలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘జనవరి 22వ తేదీని ఆర్ఎస్ఎస్, బీజేపీలు పూర్తిగా రాజకీయ కార్యక్రమంగా, మరీ ముఖ్యంగా మోడీ ఫంక్షన్ లా మార్చాయి. అందుకే ఆ ప్రోగ్రామ్ కి వెళ్లడం లేదు’ అని చెప్పారు. కాంగ్రెస్ అన్ని ఆచారాలు, మతాలను గౌరవిస్తుందని తెలిపారు. ‘హిందూ మత విశ్వాసాలను పాటించే కొంత మంది పెద్ద అధికారులు కూడా రామ్ లల్లా ప్రతిష్టాపన ప్రోగ్రామ్‌ను పొలిటికల్ కార్యక్రమంలా భావిస్తున్నారు. వారి అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్త పరిచారు. కాబట్టి మోడీ, ఆర్ఎస్ఎస్ చుట్టూ తిరిగే వేడుకకు మేము వెళ్లడం కష్టం’ అని స్పష్టం చేశారు.
Next Story