- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య నుంచి తిరిగి వచ్చాక నా తొలి నిర్ణయం.. కొత్త పథకం ప్రకటించిన మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ప్రాణప్రతిష్ఠ తర్వాత తన నివాసానికి వెళ్తున్న టైంలో పీఎం మోడీ ఓ నిర్ణయం తీసుకున్నారు. మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా సోలార్ పవర్ పెంచేందుకు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ప్రపంచంలోని భక్తులందరూ సూర్యవంశీయుడైన రాముడి కాంతితో నిరంతరం శక్తిని పొందుతారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠ తర్వాత దేశ ప్రజలంతా.. తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అందుకే ఈ పథకాన్ని ప్రారంభించనున్నాం అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ప్రధాని మోడీ.
దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ రూఫ్ సిస్టమ్ ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ స్కీం ద్వారా పేద, మధ్య తరగతి వారికి కరెంట్ బిల్లు తగ్గించమే కాకుండా విద్యుత్ రంగంలో దేశానికి స్వావలంబనగా మారుస్తుందన్నారు. ఇక.. ఈ పథకానికి సంబంధించి అధికారులు చూపించిన సోలార్ రూఫ్ టాప్ సిస్టం ప్యాలెన్స్‌ను పరిశీలించారు ప్రధాని మోడీ.
అయోధ్య ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇచ్చిన ప్రసంగంలో రాముడు శక్తి అని.. నేడు నూతన శకానికి నాంది అని పేర్కొన్నారు. రాముడు నిప్పు కాదు, శక్తి అని.. రాముడు వివాదం కాదు.. తనో పరిష్కారం అని.. రాముడు అందరివాడని పేర్కొన్నారు ప్రధాని. ఇది రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ మాత్రమే కాదని.. దేశ ఐక్యతను చూశామన్నారు.
ఢిల్లీలోని తన నివాసంలో దీపాలను వెలిగించి సెలబ్రేట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. విదేశాల్లోని భారతీయులు కూడా హర్షం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ డీసీ, ప్యారిస్, సిడ్నీ సహా ఇతర ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.