- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi : కమ్మేసిన పొగమంచు.. ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్ పోర్టు అడ్వైజరీ
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi Airport) ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. దట్టమైన పొగమంచు వల్ల విమాన కార్యకలాపాల్లో ఎదురవుతున్న సమస్యల గురించి ప్రయాణికులకు(Delhi Airport advisory) తెలిపింది. పలు విమానాలు ఆలస్యం జరిగే ఛాన్స్, లేదా రద్దయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ప్రయాణికుల కోసం సూచనలు తెలిపింది. ఎయిర్ పోర్టుకి వెళ్లే ముందు విమాన స్థితిని తనిఖీ చేయాలని సూచించింది. అంతేకాకుండా, బుధవారం ఉదయం నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దట్టమైన పొగమంచు ఉంది. దీంతో, విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. రహదారిపై తీవ్రంగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్‌కు వెళ్లే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వంటి మార్గాలలో విజిబిలిటీ తక్కువగా మారింది. దీని కారణంగా డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
అంతేకాకుండా, పొగమంచు వల్ల పలు మార్గాల్లో రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే 20 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇకపోతే, ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. అంతేకాకుండా గురు, శుక్రవారాలు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇకపోతే, మంగళవారం వర్షం పడటంతో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మెరుగుపడింది.