శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున ఇంట్లో ఇలా పూజచేస్తే మీ కోరిక తప్పక తీరుతుందట..

by Sumithra |
శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున ఇంట్లో ఇలా పూజచేస్తే మీ కోరిక తప్పక తీరుతుందట..
X

దిశ, ఫీచర్స్ : 22 జనవరి 2024 చారిత్రాత్మకమైన రోజు కానుంది. ఎన్నో ఏళ్లుగా రామభక్తులంతా ఎదురుచూస్తున్న రోజు దగ్గరకు వచ్చేసింది. వైదిక సంప్రదాయం ప్రకారం అయోధ్యలోని రామమందిరంలో రాంలాలాకు పట్టాభిషేకం జరగనుంది. అయితే ఈ రోజున రాముడి ఆశీర్వాదం పొందడానికి మీరు ఇంట్లో రాముడిని ఏ పద్ధతిలో పూజించాలి, పూజ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటిని శుద్ధి చేసుకోవాలి..

జనవరి 22న రాంలాలా ప్రతిష్ఠాపన రోజున మీ ఇంటి పరిసరాలని పూర్తిగా శుభ్రం చేయండి. ఇప్పుడు ఇంట్లో పూజగదిలో ఉన్న విగ్రహాలకు అభిషేకం చేసి శుభ్రంగా తుడవాలి చేయాలి. అలాగే దేవుని చిత్రపటాలను శద్దిచేయాలి. ఉత్తరం, తూర్పు దిశల మధ్య భాగాన్ని ఈశాన్య మూలగా పరిగణిస్తారు. ఇంటి ఈశాన్య మూలను శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఇంట్లో శ్రీ రాముడిని ఇలా పూజించండి..

ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇంట్లోని సభ్యులందరూ స్నానం చేసి నూతనవస్త్రాలను ధరించాలి. ఇప్పుడు పూజగదిలో ఎర్రటి వస్త్రాన్ని విస్తరించి, రామ్ దర్బార్ లేదా శ్రీరాముని విగ్రహం లేదా చిత్రాన్ని పెట్టాలి.

అలాగే శ్రీరాముని ముందు హనుమంతుడిని కూడా విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టాలి.

ముందుగా రాముడి విగ్రహానికి నీటితో అభిషేకం చేయించి పంచామృతంతో స్నానం చేయాలి. తరువాత మళ్లీ నీటితో అభిషేకం చేయించాలి.

తరువాత రాముడికి ధూపం, దీపం, పువ్వులు, తిలకం సమర్పించాలి. శ్రీరాముని నైవేద్యంలో స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ పెట్టాలి. రామజనం స్తుతితో రాముడిని పూజించడం ప్రారంభించండి

రాముడిని పూజించేటప్పుడు మీరు రామరక్షా స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. రామరక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా, శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీరామునికి మంగళ హారతి ఇచ్చి పూజను ముగించండి.

దీపావళి రోజు లాగా ప్రాణప్రతిష్ట రోజు సాయంత్రం ఇంటి బయట దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీకు అన్నీ శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Advertisement

Next Story