సీతాదేవి పేర్లకు ఉన్న అర్థాలు ఏమిటో తెలుసా..

by Sumithra |
సీతాదేవి పేర్లకు ఉన్న అర్థాలు ఏమిటో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీతాదేవి గురించి, ఆ తల్లి పేర్ల గురించి, వాటి అర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం సీత, శ్రీ మహాలక్ష్మి అవతారం. విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. సీతాదేవిని జానకి, మైథిలి, వైదేహి, రమ అనే పేర్లతో పిలుస్తారు.

జానకి దేవి..

సీతాదేవిని జానకి అనే పేరుతో పిలుస్తారు. సీతాదేవి తండ్రి పేరు జనకమహారాజు కాబట్టి ఆమెను జానకి అని కూడా పిలుస్తారు.

మైథిలి

సీతాదేవి తండ్రి జనక మహారాజు మిథిలా నగరానికి రాజు. అందుకే ఆయన కూతురు సీతాదేవిని మైథిలి అనే పేరుతో పిలుస్తారు.

భూమిజా

జనకమహారాజు పొలంలో దున్నుతున్న సమయంలో ఓ పెట్టెలో భూమిలో సీతాదేవి కనిపించింది. ఆమె భూమి నుండి పుట్టినందుకు ఆమెను భూమిజా అని కూడా పిలుస్తారు. అలాగే ఆమెను భూలోక పుత్రిక అని కూడా పిలుస్తారు.

లక్షకి

ఈ పేరు అంటే లక్ష్మీ రూపం. తల్లి సీతను లక్ష్మీదేవి అవతారంగా భావించి లక్షకి నాస్‌ అనే పేరుతో పూజిస్తారు.

వైదేహి

సీతాదేవి తండ్రి జనకమహారాజు మోక్షాన్ని పొందిన జ్ఞానవంతుడు. అందుకే అతన్ని విదేహ రాజ్ జనకుడు అని పిలిచేవారు. అలాగే సీతాదేవిని వైదేహి అనే పేరుతో పిలుస్తారు.

Advertisement

Next Story

Most Viewed