శ్రీరాముడి రథాన్ని జుట్టుతో లాగుతూ.. 566 కిలోమీటర్లు యాత్ర

by Sathputhe Rajesh |
శ్రీరాముడి రథాన్ని జుట్టుతో లాగుతూ.. 566 కిలోమీటర్లు యాత్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో : అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేళ భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌కు చెందిన సీర్‌బద్రి అనే సాధువు రాముడి రథాన్ని తన జుట్టుతో లాగుతూ.. 566 కి.మీ దూర ప్రయాణాన్ని ప్రారంభించారు. దమోహ్ ప్రాంతం నుంచి అయోధ్య వరకు ఈ ప్రయాణం సాగుతోందని సాధువు తెలిపారు. జనవరి 11న ఈ యాత్రను ప్రారంభించినట్లు వెల్లడించారు. రోజుకు 50 కిలోమీటర్ల చొప్పున రథాన్ని లాగుతున్నట్లు సాధువు అనుచరులు తెలిపారు. ప్రస్తుతం రథాన్ని సాధువు జుట్టుతో లాగుతూ యూపీలోని రాయ్ బరేలీ వరకు తెచ్చారు.

Advertisement

Next Story