- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tata Safari Stealth Edition: వారెవ్వా ఏం లుక్కు.. అచ్చం టాటాలా ఉంది బాసు.. సఫారీ స్టెల్త్ ఎడిషన్ లాంఛ్ అదిరిందిగా!

దిశ, వెబ్‌డెస్క్: Tata Safari Stealth Edition: టాటా మోటార్స్(Tata Motors) తన SUVలు హారియర్ , సఫారీలలో స్టెల్త్ ఎడిషన్(Tata Safari Stealth Edition)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ధర, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
స్వదేశీ కార్ల తయారుదారీ సంస్థ అయిన టాటా మోటార్స్(Tata Motors) గత నెలలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2025లో సఫారీ స్టైల్త్ ఎడిషన్(Tata Safari Stealth Edition) ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇప్పుడు తన వెబ్ సైట్లో లిస్ట్ చేసిన సఫారి ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను సైలెంట్ గా లాంఛ్ చేసింది. అకాంప్లిష్ట్డ్ ప్లస్ ట్రిమ్ ఆధారంగా తీసుకువచ్చిన ఈ సఫారి స్టైల్త్ ఎడిషన్ ధర రూ. 25.30లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది టాప్ స్పెక్ సఫారి డార్క్ ఎడిషన్ అకాంప్లిష్డ్ ప్లస్ ట్రిమ్ తో సమానంగా ఉంటుంది.
కంపెనీ ఈ టాటా సఫారీ స్టల్త్ ఎడిషన్(Tata Safari Stealth Edition) ను మూడు వేరియంట్లో తీసుకువచ్చింది. 1. అకాంప్లిష్ట్ ప్లస్ ఎంటీ 2. అకాంప్లిష్డ్ ప్లస్ ఏటీ. 3. అకాంప్లిష్డ్ ప్లస్ ఏటీ-6 సీటర్ . ఈ టాటా సఫారీ స్టెల్త్ ఎడిషన్ (Tata Safari Stealth Edition)లో స్టాండ్ అవుట్ ఫీచర్ ఏంటంటే దాని మాట్లే బ్లాక్ ఎక్స్ టీరియర్. ఇది స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే ఈ ఎస్ యూవీకి మరింత అగ్రెసివ్, కమాండింగ్ ప్రాసెస్ ను ఇస్తుంది. ఈ కారు అల్లాయ్ వీల్స్ డార్క్ ఫినిష్ తో వస్తాయి. కంపెనీ బ్యాడ్జింగ్ ప్యాకేజీలో భాగంగా ఫ్రంట్ ఫెండర్స్ కు కూడా ఇదే ఫినిషింగ్ అందించింది. ఈ ఆల్ బ్లాక్ థీమ్ క్యాబిన్ వరకు విస్తరించింది. ఇది చూడటానికి డార్క్ ఎడిషన్ రేంజ్ ను పోలి ఉంటుంది.
ఇక లోపల కార్బన్ నోయిర్ థీమ్ డ్యాష్ బోర్డ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ లెదర్ తో మరింత ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. కలర్ స్కీమ్ కాకుండా దీని క్యాబిన్ లేఅవుట్ సఫారి అకాంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో 12.3అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, నాలుగు స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్స్ ఉన్నాయి. ఈ వెర్షన్ ఏడు, ఆరు సీట్ల లే అవుట్లో అందుబాటులో ఉంటుంది.
ఫీచర్ల విషయానికొస్తే కన్వీనియన్స్ పరంగా ఈ సఫారి స్టెల్త్ ఎడిషన్ (Tata Safari Stealth Edition)లో ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే ద్వారా వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సర్ రూఫ్, అలెక్సా వాయిస్ కమాండ్స్, మ్యాప్ మై ఇండియా నుంచి ఇన్ బిల్ట్ నావిగేషన్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, జెస్టర్ కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్ గేట్, వాయిస్ అసిస్టెడ్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ప్రయాణికుల భద్రతా కోసం ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మెకానికల్ సఫారి స్టెల్త్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ తో సమానంగా ఉంటుంది. అదే 2.0లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 168 బీహెచ్ఫీ పవర్, 350 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడక్ట్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ తో వస్తుంది.