Black Color Car: బ్లాక్ కలర్ కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? రూ. 15 లక్షల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసే కార్లు ఇవే. ఓ లుక్కేయండి

by Vennela |
Black Color Car:  బ్లాక్ కలర్ కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? రూ. 15 లక్షల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసే కార్లు ఇవే. ఓ లుక్కేయండి
X

దిశ, వెబ్ డెస్క్: Black Color Car: భారత మార్కెట్లో అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లు, రంగులతో ఎన్నో కార్లు మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు భారతీయ మార్కట్లో బ్లాక్ కలర్ కార్ల( Black Color Car) కు ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే కంపెనీలు కూడా వినియోగదారుల అభిరుచి మేరకు బ్లాక్ కలర్ లో కార్ల( Black Color Car)ను ప్రవేశపెడుతున్నాయి. ఇతర రంగులతో పోలిస్తే బ్లాక్ కలర్ కార్ల( Black Color Car)ను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో వాటికి డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మీరు కూడా బ్లాక్ కలర్ కారు( Black Color Car)ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే రూ. 15లక్షల వరకు అందుబాటులో ఉన్న ఈ కార్లపై ఓ లుక్కెయ్యండి.

1. MG కామెట్ EV బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్

MG కామెట్ EV ఇటీవలే బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టింది. ఇది దాని టాప్-స్పెక్ ఎక్స్‌క్లూజివ్ FC వేరియంట్ ఆధారంగా రూపొందించారు. సాధారణ వేరియంట్ కంటే రూ. 30,000 ఎక్కువ ధరతో ఉంటుంది. ఇది అల్లాయ్ వీల్స్ పై రెడ్ కలర్ యాక్సెంట్లు, బోనెట్ పై బ్రాండింగ్, ఫాగ్ లాంప్ గార్నిష్, ఫ్రండ్ అండ్ బ్యాక్ స్కిడ్ ప్లేట్లు, బాడీ మోల్డింగ్‌ను కలిగి ఉంటుంది. దీనికి ముందు ఫెండర్‌పై బ్లాక్‌స్టార్మ్ బ్యాడ్జ్ ఉంది.

2. హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్

ధర: రూ. 8.46 లక్షలు (ఎక్స్-షోరూమ్)

హ్యుందాయ్ ఎక్స్‌టీరియర్ నైట్ ఎడిషన్ జూలై 2024లో మార్కట్లోకి లాంచ్ అయ్యింది. ఇందులో బయట, లోపల డిజైన్‌కు పూర్తిగా బ్లాక్ కలర్ థీమ్ లో ఉంటుంది. దీనికి బ్లాక్-అవుట్ బ్యాడ్జ్‌లు, అల్లాయ్ వీల్స్,ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కిడ్ ప్లేట్లు, డాష్‌బోర్డ్, సీట్ అప్హోల్స్టరీ లభిస్తాయి.

3.టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్

ధర: రూ. 9.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)

టాటా మోటార్స్ భారత మార్కెట్లో తన అనేక వాహనాలకు డార్క్ ఎడిషన్లను అందిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది కంపెనీ అత్యంత చౌకైన కార్లలో ఒకటి.

4. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్

ధర: రూ. 10.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)

హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాగానే, వెన్యూ నైట్ ఎడిషన్ కూడా అందిస్తుంది. ఇది పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇది హై-స్పెక్ S(O), SX , SX(O) వేరియంట్లలో వస్తుంది.

5.టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్

ధర: రూ. 11.70 లక్షలు (ఎక్స్-షోరూమ్)

టాటా ఆల్ట్రోజ్ లాగానే, టాటా మోటార్స్ నెక్సాన్ కూడా డార్క్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. ఇది క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ ఎస్, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ ప్లస్ ఎస్ వేరియంట్లలో వస్తుంది.

6. MG ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్

ధర: రూ. 13.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)

MG ఆస్టర్ బ్లాక్‌స్ట్రోమ్ ఎడిషన్ సెప్టెంబర్ 2024లో మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. హై-స్పెక్ సెలెక్ట్ వేరియంట్ ఆధారంగా రూపొందించింది.

7.హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్

ధర: రూ. 14.62 లక్షలు (ఎక్స్-షోరూమ్)

హ్యుందాయ్ ఎక్సెంట్, వెన్యూ నైట్ ఎడిషన్ లాగానే, క్రెటా నైట్ ఎడిషన్ కూడా బ్లాక్ కలర్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, డార్క్ క్రోమ్ ఎలిమెంట్స్‌తో కూడిన బ్లాక్ గ్రిల్, బ్లాక్డ్-అవుట్ బంపర్లు, టెయిల్‌గేట్‌పై నైట్ ఎడిషన్ బ్యాడ్జ్‌తో వస్తుంది. ఇది డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ చుట్టూ కాంట్రాస్టింగ్ కాపర్ ఇన్సర్ట్‌లతో పూర్తిగా బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ను పొందుతుంది.

Next Story

Most Viewed