ప్రభుత్వ ఆస్తుల రక్షణకు పోరాడుదాం: రావులపల్లి

by Sridhar Babu |
Jenda-11
X

దిశ, భద్రాచలం: ప్రజావ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న పాలక ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టి అపరిష్కృత సమస్యల సాధన కోసం ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 97వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ భద్రావలం డివిజన్ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు, పోరాటాల ద్వారా ప్రజల్లో మమేకమైందన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెడుతూ ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేసే విధానాలకు స్వస్తి పలకాలన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, ప్రజాస్వామ్య విలువలు కాపాడటం కోసం పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవ వేళ ప్రతినబూని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మళ్ల వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి సునీల్ కుమార్, నాయకులు సాయికుమార్, బత్తుల నరసింహులు, భద్రాద్రి వెంకటేశ్వరరావు, కల్లూరి శ్రీరాములు, లంకపల్లి విశ్వనాథ్, మీసాల భాస్కరరావు, మారెడ్డి శివాజీ, ఇమామ్ ఖాసీం, సుశీలమ్మ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మారెడ్డి గణేష్, వరలక్ష్మి, వెంకటమ్మ, ఏఐవైఎఫ్ నాయకులు డానియల్ ప్రదీప్, బద్ది బాబి, కట్టా శివరాంకి, గాఫుర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed