భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా

by Shamantha N |
భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 9,309 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బారిన పడి గురువారం ఒక్కరోజే 87 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,80,603 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,55,447 మంది మృతి చెందారు.

దేశంలో ప్రస్తుతం 1,35,926 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,05,89,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. జాతీయ రికవరీ రేటు 97.32 శాతం ఉండగా.. యాక్టివ్ కేసులు 1.25 శాతం ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటివరకు 75,05,010 మందికి టీకా వేసినట్లు వెల్లడించింది.

తెలంగాణలో తాజాగా ఎన్ని కరోనా కేసులంటే..?

Advertisement

Next Story

Most Viewed