- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా: దేశంలో 930 కేసులు.. 23 మృతులు!
దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా కేసులు 930 దాటాయి. ఈ వైరస్ కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోయినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కాగా, శనివారం సాయంత్రానికి 907 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 19 మంది ఈ వైరస్ కు బలైనట్టు తెలిపింది. ఇందులో 80 మంది కోలుకున్నట్టు వివరించింది. మహారాష్ట్రలో 180 కేసులు నమోదైనట్టు కేరళలో 176 కేసులు వెలుగుచూసినట్టు వెల్లడించింది.
ముంబైలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 22 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏడు నెలల పాప, సంవత్సరం బాలుడు కూడా ఉన్నారు.
జైలులో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం… 11 వేల మంది ఖైదీలను విడుదల చేయనుంది. గరిష్టంగా ఏడేళ్ల కారాగార శిక్షను అనుభవిస్తున్న ఈ ఖైదీలను ఎనిమిది వారాల పాటు బయటకు పంపించేందుకు సోమవారం విడుదల చేయనున్నట్టు తెలిపింది.
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 183 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. నాలుగు లక్షల మందికి ఆహారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 500 స్కూళ్లు, సుమారు 250 నైట్ షెల్టర్లలో ఆహారాన్ని పంపిణీ చేయనున్నట్టు పేర్కొంది.