- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిలిమంజారో అధిరోహించిన 9ఏళ్ల చిన్నారి
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 ఏళ్ల చిన్నారి అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతాల్లో రెండో పర్వతమైన మౌంట్ కిలిమంజారో అధిరోహించి రికార్డు సృష్టించింది. ఆసియాలోనే ఈ పర్వాతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర నెలకొల్పింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ రికార్డు సాధించిన రెండో పిన్నవయస్కురాలిగా కూడా రికార్డు నెలకొల్పింది. అనంతరపురం జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అనే చిన్నారి ఈ ఘనత సాధించింది.
టాంజేనియాలోని మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఇది ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతం. అంతేకాకుండా ప్రపంచంలోనే ఇది అత్యంత ఎత్తైన రెండో పర్వతం. రిత్విక శ్రీ కిలిమంజారోను అధిరోహించినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు కలెక్టర్ గంధం చంద్రుడు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇలానే స్ఫూర్తి నింపుతూ ఉండు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రిత్విక శ్రీకి ఎస్‌సీ కార్పొరేషన్ నిధుల నుంచి రూ.2.98 లక్షలు విడుదల చేశారు.