చౌటుప్పల్‌లో 9 పాజిటివ్ కేసులు

by vinod kumar |   ( Updated:2020-07-21 11:24:37.0  )
చౌటుప్పల్‌లో 9 పాజిటివ్ కేసులు
X

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 41 మందికి పరీక్షలు చేయగా తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. బాధిత వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేసే పనిలో పడ్డారు వైద్యాధికారులు. ప్రజలంతా దయచేసి ఏ ఒక్కరు కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దంటూ వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే చీకటిమామిడి గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed