ఉమ్మడి నిజామాబాద్‌లో 87 పాజిటివ్ కేసులు

by Shyam |
ఉమ్మడి నిజామాబాద్‌లో 87 పాజిటివ్ కేసులు
X

దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం 87 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నిజామాబాద్ జిల్లాలో 27, కామారెడ్డి జిల్లాలో 60 నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. చికిత్స పొందుతూ ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. జిల్లాలో 1032 మొత్తం కేసులు అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ డివిజన్ నుంచి సేకరించిన 100 శాంపిల్స్ ద్వారా 24 పాజిటివ్ కేసులు వెలుగు చూసాయి.

ఎల్లారెడ్డి డివిజన్ నుంచి సేకరించిన 70 శాంపిల్స్ ద్వారా 16 కరోనా కేసులు బహిర్గతం అయ్యాయి. జిల్లాలో ర్యాపిడ్ టెస్టుల ద్వారా 20 పాజిటివ్ కేసుల ఫలితాలు గుర్తించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 779కి చేరిన కరోనా కేసుల సంఖ్యగా ఉంది.

Advertisement

Next Story