- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా @ 813
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. ఏపీలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం కరోనా నిరోధానికి అన్ని చర్యలు చేపడుతున్నామని చెబుతోంది. వేల మందిని గుర్తించామని, వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అంటోంది. ఎన్ని చేసినా కరోనా మాత్రం కొలిక్కి రావడం లేదు. మరోవైపు కర్నూలు జిల్లా దేశంలోనే అత్యంత వేగంగా కరోనా సోకుతున్న జిల్లాగా పేరుగాంచింది.
కాగా, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 813కి చేరుకుంది. వారిలో 120 మంది డిశ్చార్జ్ కాగా, 24 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పుడు ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 669 అని ప్రకటించింది.
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు డబుల్ సెంచరీ దాటేశాయి. దీంతో రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు గల జిల్లాగా కర్నూలు తన స్థానాన్ని నిలబెట్టుకుంది. నిన్న ఆ జిల్లాలో 19 కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 203కు చేరుకుంది. వారిలో నలుగురు కోలుకోగా, ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 194 మందికి చికిత్స పొందుతున్నారు.
ఆ తరువాతి స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో కూడా 19 కరోనా పాజిటివ్ కేసులు నిన్న నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 177కి చేరుకుంది. అయితే 23 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడం కాస్త ఊరటనిచ్చే అంశమని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఈ జిల్లాలో అత్యధికంగా 8మంది మృతి చెందారు. దీంతో ఈ జిల్లాలో ఇప్పటి వరకు 146 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. నిన్న ఈ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ తేలగా, మొత్తం 86 మందికి ఈ జిల్లాలో కరోనా సోకింది. ఇందులో 64 మందికి చికిత్స పొందుతుండగా, 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో నిన్న ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో కేసుల సంఖ్య 59కి చేరుకుంది. కడపలో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 51కి చేరుకుంది. ప్రకాశం జిల్లాలో నాలుగు కేసులు నమోదు కావడంతో అక్కడ 48 కేసులు నమోదయ్యాయి.
నెల్లూరులో 67 కేసులు, అనంతపురంలో 36, తూర్పుగోదావరిలో 26 , విశాఖపట్టణంలో 21, పశ్చిమ గోదావరిలో 39 కరోనా కేసులు నమోదయ్యాయి.
Tags:coronavirus, covid-19, andhra pradesh, health department