- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
80 శాతం మంది పెట్టుబడులు భారత్‌లోనే!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో దాదాపు 80 శాతం మంది దేశీయ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారని హెచ్ఎస్‌బీసీ మొదటి వార్షిక గ్లోబల్ ఇండియన్ పల్స్ నివేదిక వెల్లడించింది. అయితే 59 శాతం మంది వచ్చే మూడేళ్లలో పెట్టుబడులను పెంచాలని ప్రయత్నిస్తున్నారని నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం.. 77 శాతం కంటే ఎక్కువమంది భారత్‌తో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.
80 శాతం మంది దేశ భవిష్యత్తుపై ఆసక్తిని కలిగి ఉన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఏదొక రూపంలో మద్దతివ్వడమేనని, గ్లోబల్ ఇండియన్లు గణనీయమైన సహకారాన్ని ఇస్తున్నారని నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా ఎక్కడ ఉన్నప్పటికీ భారత్‌తో వారికున్న భావోద్వేగ, ఆర్థిక సంబంధాల బలాన్ని నివేదిక ప్రధానంగా పేర్కొంది. ముఖ్యంగా క్రీడలు, ఆహారం, రాజకీయాలు, సైన్స్, ఆర్థిక విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సహకారాన్ని అందిస్తున్నారని హెచ్ఎస్‌బీసీ ఇండియా హెడ్ రఘు నరులా అన్నారు.