- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత బాక్సర్లు
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబా) ఆధ్వర్యంలో పోలాండ్‌లో నిర్వహిస్తున్న యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌కు 8 మంది భారత బాక్సర్లు చేరుకున్నారు. ఏడుగురు మహిళా బాక్సర్లతో సహా ఒక పురుష బాక్సర్ ఫైనల్ చేరుకోవడం భారత బాక్సింగ్ చరిత్రలో ఇదే తొలిసారి. మొదటిగా 48 కేజీల విభాగంలో గీతిక ఇటలీకి చెందిన ఎరికాపై 5-0 తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన నటాలియా డోమినికతో తలపడనున్నది. 51 కేజీల విభాగంలో బేబీ రోజిసన చాను సెమీస్‌లో ఇటలీకి చెందిన ఎలెన్‌పై సునాయాసంగా గెలుపొందింది. వీరిద్దరితో పాటు వింకా (60 కేజీలు), అరుంధతి చౌదరి (69 కేజీలు), పూనమ్ (57 కేజీలు), సనామాచ చాను (49 కేజీలు), అల్ఫియా పఠాన్ (81+ కేజీలు)లో ఫైనల్ చేరుకున్నారు. ఇక పురుషుల 56 కేజీల విభాగంలో సచిన్ ఒక్కడే ఫైనల్స్ చేరుకున్నాడు. సెమీస్‌లో ఇటలీకి చెందిన మైఖేల్ బల్దాసీపై 5-0 తేడాతో విజయం సాధించాడు. ఫైనల్‌లో కజకిస్తాన్‌కు చెందిన సాబైర్‌తో తలపడనున్నాడు. ఫైనల్స్‌కు చేరడంతో ఇప్పటికే గెలుచుకున్న 3 కాంస్య పతకాలకు తోడు మరో 8 పతకాలు కలిపి 11 ఖాయం అయ్యాయి. 2018లో హంగేరీలో జరిగిన యూత్ చాంపియన్‌షిప్స్‌లో భారత బృందం 10 మెడల్స్ గెలుచుకున్నది.