- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
75శాతం ప్రైవేటు ఉద్యోగాలు స్థానికులకే!
రాంచీ : ప్రైవేటు రంగంలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలన్న నిబంధనను జార్ఖండ్ ప్రభుత్వం తేనున్నది. నెలకు గరిష్టంగా రూ. 30వేల వరకు వేతనం ఉండే ఉద్యోగాల్లో స్థానికులకే 75శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి విధానాల రూకల్పనలో రాష్ట్ర ప్రభుత్వ మునిగింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటనను సీఎం హేమంత్ సోరెన్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించే అవకాశమున్నదని సంబంధితవర్గాలు తెలిపాయి. ఈ నెల 17న సీఎం ప్రకటించినున్నారని అంచనా వేస్తున్నాయి. హర్యానా ప్రభుత్వమూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేటురంగంలో స్థానికులకు 75శాతం కోటా కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం ఇటీవలే నోటిఫై చేసింది. జార్ఖండ్ ప్రభుత్వమూ ఇదే తరహా నిర్ణయానికి చాలా కాలంగా యోచిస్తున్నదని, ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి సంబంధిత అధికారులతో సమావేశాలు జరిపినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంలో మరో చిక్కు ఎదురవుతున్నదని, స్థానికుల గుర్తింపు కత్తిమీద సాము వ్యవహరంగా మారనుందనీ వివరించాయి. గిరిజనులే ప్రాధాన్యంగా జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే స్థానికుల గుర్తింపులో విమర్శలపాలైన సీఎం బాబులాల్ మరాండీ 2002లో సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత రఘుబర్ దాస్ స్థానికతపై కొన్ని విధానాలను రూపొందించినప్పటికీ గిరిజనులకు ప్రాధాన్యతనివ్వలేదన్న విమర్శలను మూటగట్టుకున్నారు.