- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణకు 7.5లక్షల టీకా డోసుల దిగుమతి..ఎప్పుడంటే..?
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రానికి 7.5లక్షల డోసుల కరోనా టీకాలు రేపు దిగుమతి కానున్నాయి. వీటిలో 1లక్ష కోవాక్సిన్ డోసులు ఉండగా , 6.5లక్షలు కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు ఉన్నాయి. ఆదివారం రాత్రి రాష్ట్రానికి 2.7 లక్షల వ్యాక్సిన్ డోసులు దిగుమతి కాగా వీటిని కేవలం రెండో డోసు వారికి మాత్రమే వ్యాక్సిన్ అందించారు. టోకెన్ తీసుకున్న కొద్ది మందికి మాత్రమే మొదటి డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ కొరత ఏర్పడటంతో మొదటి డోసు టీకా తీసుకునే వారికి ఎదురుచూపులు తప్పడం లేదు .
గడిచిన 24గంటల్లో 4009 కేసులు నమోదుకాగా మొత్తం ఆక్టీవ్ కేసులు 39,154 కి చేరుకున్నాయి. ఒక రోజులో 14మంది చనిపోగా మృతుల సంఖ్య 1,838 కి చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 705, రంగారెడ్డిలో 336, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 363 కేసులు నమోదవగా జిల్లాల్లో జగిత్యాలలో 175, కామారెడ్డిలో 115, కరీంనగర్ లో 135, ఖమ్మంలో 113, మహబూబ్ నగర్ లో 129, మంచిర్యాలలో 111, నిజామాబాద్ లో 360, సంగారెడ్డిలో 264, సిద్దిపేటలో 125, వరంగల్ అర్బన్ లో 146 కేసులు నమోదయ్యాయి, అత్యల్పంగా కొమరం భీం ఆసిఫాబాద్ లో 25, ములుగులో 26 కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని చోట్ల హెల్త్ ఆఫీసర్స్ కరోనా కేసుల వివరాలు చెప్పడంలో మొండికేసారు.