అమెరికాలో మరో 68,212 పాజిటివ్ కేసులు

by vinod kumar |
అమెరికాలో మరో 68,212 పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. శనివారం కూడా దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 68,212 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,74,437కు చేరుకుంది. మరోపక్క శనివారం అమెరికా వ్యాప్తంగా కరోనా కారణంగా 1,067 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,46,391కు చేరింది. కాలిఫోర్నియా, టెక్సాస్, అలబామా, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా మరాయి. ఫ్లోరిడాలో ఇటీవల ఒక్క రోజులోనే ఏకంగా 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా నిత్యం వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed