ఆ రోజున 1000 మంది రైతులతో పార్లమెంటు ముట్టడిస్తాం : రాకేష్ టికాయత్

by Anukaran |   ( Updated:2021-11-24 03:54:29.0  )
ఆ రోజున 1000 మంది రైతులతో పార్లమెంటు ముట్టడిస్తాం : రాకేష్ టికాయత్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రం కనీస మద్దతు ధరపై చట్టాన్ని తీసుకొచ్చే వరకు తమ పోరాటం ఆగదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 29న 60 ట్రాక్టర్లలో 1000 రైతులతో పార్లమెంటు వద్దకు వెళ్తామని ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మొదలుపెట్టిన ఉద్యమం ఈ నెల 26తో సంవత్సరం పూర్తవుతుందని టికాయత్ ఏఎన్ఐకి తెలిపారు.

ఆరోజు రైతులతో సమావేశం నిర్వహించిన అనంతరం పూర్తి సమాచారాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది జనవరి 26 వరకు ఢిల్లీలో ఉండాలన్న ఉద్దేశ్యం లేదని, ఎంఎస్‌పీ చట్టంతో పాటు ఉద్యమంలో చనిపోయిన 750 రైతులకు నష్టపరిహారం అందిస్తే తిరిగి ఇంటికి వెళ్లిపోతామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed