కారులో తరలిస్తున్న నాటు సారా పట్టివేత

by Shyam |
కారులో తరలిస్తున్న నాటు సారా పట్టివేత
X

దిశ, నల్లగొండ: యాదాద్రి జిల్లా మోత్కూరు శివారులో కారులో అక్రమంగా తరలిస్తున్న 6 లీటర్ల నాటు సారాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తుంగతుర్తిలోని గిరిజన తండాల్లో సారా కొనుగోలు చేసి హైదరాబాదుకు తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. దీనిని నగరంలో లీటరుకు రూ.1000 చొప్పున అమ్ముతున్నట్టు నిందితులు అంగీకరించినట్టు సమాచారం. ఇకమీదట సారాయి కొనుగోలు చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు మోత్కూరుకు చెందిన వారీగా గుర్తించగా, వారిని అరెస్టు చేసి కారును సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

tags: spirit found in car, yadadri dist, illegal shift, 6 litre

Advertisement

Next Story