- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కశ్మీర్‌లో కొత్త రికార్డు.. ఒకేసారి 55 జంటలకు పెళ్లి!
దిశ, వెబ్‌డెస్క్ : శ్రీనగర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కశ్మీర్ లోయలోని వివిధ జిల్లాలకు చెందిన 55 మందికి పైగా అణగారిన వర్గాలకు చెందిన జంటలు ఆదివారం పెళ్లి చేసుకున్నారు. కశ్మీర్‌లో ఇదే అతిపెద్ద కార్యక్రమం అని వేడుక నిర్వాహకులు జాఫ్రీ కౌన్సిల్ తెలిపారు. శ్రీనగర్‌లోని అమర్‌సింగ్ క్లబ్‌లో జరిగిన ఈ వేడుకను డజన్ల కొద్దీ ప్రజలు తిలకించారు. కౌన్సిల్ ఇంతకు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించింది. అయితే ఈ సంవత్సరం 55 జంటలతో జరిగిన ఈవెంట్ ఇప్పటివరకు జరిగిన వాటిల్లో అతిపెద్దదని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి వివాహాన్ని జంటలు చాలా సులభంగా చేసుకోవచ్చని జాఫ్రీ కౌన్సిల్ అధ్యక్షుడు హాజీ ముసాదిక్ హుస్సేన్ తెలిపారు.
జంటలు వారి వివరాలను సంస్థలో రిజిస్టర్ చేసుకున్నాకా “ఆ జంటలు సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారా కాదా అని చూసిన తర్వాతే ధృవీకరిస్తామని అతను చెప్పాడు. ఇలా అర్హులైన జంటలకు సంస్థనే వివాహానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభిస్తుంది,” అన్నారాయన.