సెంట్రల్ ఎంప్లాయీస్.. వర్క్ ఫ్రమ్ హోం

by sudharani |
సెంట్రల్ ఎంప్లాయీస్.. వర్క్ ఫ్రమ్ హోం
X

న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడాన్ని దృష్టిలో పెట్టుకుని 50శాతం గ్రూప్ బీ, గ్రూప్ సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ బీ, గ్రూప్ సీ సెంట్రల్ ఎంప్లాయీస్ 50శాతం మంది మాత్రమే ఆఫీస్‌కు అటెండ్ కావాలని, మిగతా 50శాతం మంది వర్క్ ఫ్రమ్ హోం రూపంలో ఇంటి నుంచే విధులు నిర్వహించాలని తెలిపింది. ఆఫీస్‌కు వచ్చే 50శాతం ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో(ఉదయం 9.00- సాయంత్రం5.30, ఉదయం 9.30 – సాయంత్రం 6.00, ఉదయం 10.00- సాయంత్రం 6.30 గంటల వరకు ) రావాలని సూచించింది. ఇంటి నుంచి పనిచేసేవారు టెలిఫోన్, ఎలక్ట్రానిక్ మార్గాల్లో ఎప్పుడూ అనుసంధానంలో ఉండాలని, అలాగే అత్యవసర సమయంలో ఎప్పుడు ఆఫీస్‌కు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. వచ్చే నెల 4వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందని వివరించింది. అలాగే, అత్యవసర విధులు, కరోనావైరస్ అరికట్టే విధుల్లో ఉన్నవారికి ఈ అవకాశం లేదని పేర్కొంది.

Tags : central employees, work from home, group b, group c, 50 pc, staggers

Advertisement

Next Story

Most Viewed