కరోనా చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో 50శాతం పడకలు

by vinod kumar |   ( Updated:2021-04-06 11:46:23.0  )
కరోనా చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో 50శాతం పడకలు
X

దిశ,తెలంగాణ బ్యూరో : కరోనా రోగులకు సేవలందించేందుకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం కీలక నిర్ణయాన్ని ప్రకటించాయి. అన్ని ప్రైవేటు కార్పోరేట్ ఆసుపత్రుల్లో 50శాతం పడకలను కరోనా ఎమర్జెన్సీ రోగులకు చికిత్సలు అందించేందుకు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు తమ అంగీకారాన్ని తెలియజేశారు. దీంతోపాటు ఎలక్టివ్ సర్జరీలను తగ్గించుకుంటామని వైద్యశాఖకు తెలిపారు. వ్యాధి తక్కువగా ఉన్న రోగుల కోసం ప్రైవేటు హోటల్స్ లో కొవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తామన్నారు. కేసుల సంఖ్య పెరిగితే చాలా మంది రోగులు ఆసుపత్రిలో చేరాల్సి వస్తే బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడుతుందని వైద్యశాఖ భావించింది. ఇందుకోసం ముందస్తుగానే చికిత్సలు అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులను కోరడంతో వారు అంగీకరించారు.

ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాకాని సీరియస్ అయ్యేవారి సంఖ్య తక్కువగానే ఉంటుందని వైద్యారోగ్యశాఖ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందితో సమావేశమై తెలిపింది. పాజిటివ్ లు బాగా పెరిగితే అందులో 5 శాతం ఆస్పత్రుల్లో ఆడిట్ కావాల్సి ఉంటుందన్నారు. అలాంటప్పుడు లక్షల్లో కేసులు వస్తే సీరియస్ రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేశారు. అలాంటి పరిస్థితులు ఏర్పడితే చికిత్స అందించే పరిస్థితి ఉండదన్నారు. కొంతమంది కొవిడ్ పాజిటిస్టు సీరియస్ కాకపోయినా, సాధారణ లక్షణాలున్నా ఆస్పత్రుల్లో చేరుతున్నారని వారివల్ల నిజంగా చికిత్స అవసరమయ్యే వారికి పడకలు దొరకని పరిస్థితి ఎదురు అవుతుందని వైద్యశాఖ భావించింది. సీరియస్ ఉన్న కేసులను మాత్రమే ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని వైద్యశాఖ కోరింది. లక్షణాల్లేని కేసులకు ఇళ్ల వద్ద ఉంచి చికిత్సలు అందించాలని ప్రైవేటు ఆస్పత్రులకు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ చికిత్స అందిస్తోన్న ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలోనూ ప్రస్తుతం ఆక్సిజన్, ఐసీయూ పడకలన్నీ కలపి 7,064 బెడ్ ఉన్నాయి. అందులో ప్రస్తుతం 1695 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed