జగిత్యాలలో కరోనా@ హాఫ్ సెంచరీ

by Sridhar Babu |
జగిత్యాలలో కరోనా@ హాఫ్ సెంచరీ
X

దిశ, కరీంనగర్ :
జగిత్యాల జిల్లా వాసులను కరోనా వైరస్ తీవ్రంగా భయపెడుతోంది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో వలస కార్మికులు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే జిల్లాలో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగుతోంది. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న జిల్లాగా జగిత్యాల నిలిచింది.ఇప్పటి వరకు 6 వేల మంది వలస కార్మికులు ఇళ్లకు చేరుకోగా, వీరందరిని జిల్లా అధికార యంత్రాంగం క్వారంటైన్ చేశారు. వారిలో వైరస్ లక్షణాలు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నేటికి జిల్లాలో 54 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు. చికిత్స నుంచి కోలుకుని నలుగురు డిశ్చార్జి అవ్వగా, 48 యాక్టివ్ కేసులు ఉన్నట్టు జిల్లా అధికార యంత్రాంగం స్పష్టంచేసింది. హఫ్ సెంచరీ కేసులు దాటిన జగిత్యాలలో పకడ్భందీ చర్యలు చేపడుతున్నట్టు వైద్య అధికారులు తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న వారే కాకుండా ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారి వివరాలు కూడా సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ముంబాయి, భీవండి, షోలాపూర్ ప్రాంతాలకు వలస వెల్లిన కూలీలు నిత్యం జిల్లాకు వస్తూనే ఉన్నందున మరిన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed