గురక నిద్రపోనివ్వడం లేదా.. ఇది మీకోసమే..!

by sudharani |
గురక నిద్రపోనివ్వడం లేదా.. ఇది మీకోసమే..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

సాధారణంగా గురక రెండు రకాలు. మొదటిది మనిషి ఎక్కువగా అలిసిపోయి వచ్చి పడుకున్నప్పుడూ గురక పెట్టడం కామన్. అయితే ఆ విషయం అతనికి ఏర్పడదు. కానీ పక్కన వాళ్లను ఇబ్బంది పెడుతుంది. రెండోవది శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తరచూ వచ్చే సమస్యే గురక. వాళ్లు ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకునే సమయంలో శబ్దం వస్తుంది. చాలా మంది ఇళ్లల్లో ఒకరిద్దరికీ ఈ సమస్య ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. వీటిని కనుక పాటిస్తే ఇక మీరు నిశ్చింతంగా పడుకోవడమే కాకుండా, మీ పక్కన వారు కూడా హాయిగా నిద్రించవచ్చు.

గురకను నియత్రించే విధానాలు..

1. పడుకునే విధానం..

ముందుగా మీరు పడుకునే విధానాన్ని గమనించాలి. సామాన్యంగా గురక పెట్టేవారు వెల్లికలా పడుకుంటారు. అలా కాకుండా వన్ సైడ్ పడుకుంటే గురక తగ్గిపోవచ్చు. అలాగే మీ కడుపు భాగాన్ని గట్టి పరుచుకుంటే ఈ గురక తగ్గిపోవచ్చు. ట్రై చేసి చూడండి.

2. కొంచెం తేనె తీసుకొండి..

గురకతో బాధపడేవారు నిద్రపోయే ముందు ఓ నాలుగు చుక్కల తేనె వేసుకుంటే గురక తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది.

3. స్పీడ్‌గా రన్నింగ్ చేయడం..

గురకతో బాధపడే వారు రోజూ ఐదు, పది నిమిషాలు వేగంగా పరుగెత్తాలి. బయటకు వెళ్లడం కుదరకపోతే ఒకే చోట నిలబడి నోరు మూసుకొని పరిగెత్తినట్లు చేయంది. అలా చేస్తే అవయవాలు యాక్టివ్‌గా పనిచేసి ముక్కు దిబ్బడ తగ్గే అవకాశం ఉంటుంది.

4. ప్రాణాయామం..

శ్వాస సంబంధిత సమస్య వలన గురకతో బాధపడేవారు క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయాలి. ఇలా చేయడం వలన శ్వాస తీసుకునే వ్యవస్థ మెరుగుపడుతుంది. అలా చేస్తే నోటితో శ్వాసతీసుకునే విధానానికి క్రమంగా స్వస్తి పలకవచ్చు.

5. ముక్కు దిబ్బడ ఉంటే నెయ్యి వాడండి..

నిద్రించే ముందు ముక్కు నాళాన్ని శుభ్రం చేసుకోవాలి. దాంతో రాత్రుళ్లు గురక రాదు. అయినా తగ్గకపోతే మీరు నేతిని వాడవచ్చు. ఒకవేళ ముక్కు దిబ్బడ సమస్య తగ్గకపోతే అది మీ శ్వాస మీదనే కాక, మొత్తం శరీర వ్యవస్ధ మీద అనేక దుష్ప్రభావాలు చూపుతుంది. ఒక వారం పదిరోజులు మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ముక్కు రంధ్రాల్లో గోరువెచ్చటి నెయ్యి చుక్కలు వేస్తే దాని ప్రభావం కొంత ఉంటుంది. అంతేకాక ముక్కు రంధ్రాలకు అది కాస్త లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది. అలా చేయడం నచ్చకపోతే మందుల షాపుల్లో సలైన్ ముక్కు స్ప్రేలు దొరుకుతున్నాయి. దానిని ముక్కులో స్ప్రే చేసుకోవడం వల్ల మీ ముక్కు దిబ్బడను తగ్గించడమే కాకుండా ముక్కుని శుభ్రం చేసి గురకను కొంత వరకు నివారిస్తుంది. అది కుదరకపోతే కొత్తగా మార్కెట్లో క్లిప్స్ వచ్చాయి. దానిని ముక్కు పై భాగానా పెట్టుకుంటే మూసుకుపోయిన ముక్కు రంధ్రాలను అది తెరుస్తుంది. దీంతో సులువుగా ముక్కతో గాలి తీసుకోవచ్చు. దాంతో గురక కంట్రోల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed