- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టూరిస్టు బస్సును ఢీకొట్టిన ట్రక్కు..5గురు మృతి
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని బాప్ ప్రాంతంలో ఈరోజు ఉదయం 11వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్టూ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 12మంది గాయపడ్డారు. టూరిస్టు బస్సు ఢిల్లీ నుండి జై సల్మీర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని కోరారు.
Next Story