- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా భయంతో పాలసీలకు పెరిగిన డిమాండ్!
దిశ, వెబ్‌డెస్క్: మనిషికి మరణ భయం అన్నిటికంటే పెద్దది. దీనికి మంచి ఉదాహరణ..ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి. ఎందుకంటే, మనదేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తక్కువ కాలంలో అత్యధికంగా జీవిత, ఆరోగ్య భీమా పాలసీలకు అధిక డిమాండ్ ఏర్పడటం. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గడిచిన ఇరవై, ముప్పై రోజుల్లో భీమా పాలసీలు భారీగా పెరిగాయని సంస్థలు చెబుతున్నాయి. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పాలసీబజార్ ఆరోగ్య భీమ డిమాండ్ 35 నుంచి 40 శాతం పెరిగాయని, జీవిత భిమా పాలసీలు 20 శాతం పెరిగాయని వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పాలసీలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడుతున్నారు. సాధారణంగా పాలసీలు మార్చి నెలలో అధిక వృద్ధిని నమోదు చేస్తుంది. అయితే, గడిచిన రెండేళ్లలో ఎన్నడూ కానంతగా ఈ ఏడాది 10 శాతం వృద్ధి కంటే అత్యధిక వృద్ధిని నమోదు చేశామని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
డిజిటల్ ఇన్సూరెన్స్ చేసేవారి ఆరోగ్య భీమా పాలసీలు జనవరి కంటే మార్చిలో 50 శాతం పెరిగాయి. కరోనా వ్యాప్తి కారణంగా భీమా పాలసీలను మార్చి మొదటివారంలోనే ప్రారంభించడం వల్ల స్పందన ఎక్కువగా ఉంది. కేవలం ఒక్క నెలలో మొత్తం ప్రీమియంల విలువ రూ. 39 లక్షలకు చేరుకుంది. అంటే, రెగ్యులేటరీ నిర్ణయించిన రూ. 50 లక్షల పరిమితికి చాలా దగ్గర్లో ఉన్నం. ఇకమీద తక్కువగా ప్రీమియం తీసుకుంటాం అని డిజిట్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ అండ్ డిరెక్టర్ వివేక్ అన్నారు.
డిజిటల్ ప్లాట్‌ఫామ్ వారికి ఇది సంతోషించే విషయమైతే, సాంప్రదాయ భీమా సంస్థల పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. వారు తమ పాలసీలను ప్రధానంగా భీమా ఏజెంట్ల ద్వారా విక్రయిస్తారు. లాక్‌డౌన్ వల్ల గతేడాదితో పోలిస్తే ఈసారి 50 శాతం పడిపోయిందని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఎండీ ఎస్. ప్రకాష్ తెలిపారు. ‘సేల్స్ మేనెజర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు కస్టమర్లను కలుసుకోలేక మార్చి మొదటివారం నుంచి నాలుగో వారానికి విక్రయించిన పాలసీలు క్రమంగా క్షీణించాయి. ఫిబ్రవరిలో 32 శాతం వృద్ధి చేశామని ఆయన చెప్పారు. కరోణా వల్ల పరిస్థితులను అవగాహన చేసుకున్న వారు పాలసీలకు మొగ్గు చూపడంతో మొత్తం ఈ పరిశ్రమ 25 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మారుతున్న అవసరాల్ని బట్టి ఇదివరకటి సాంప్రదాయ పాలసీల కంటే, 10 నుంచి 20 శాతం డిజిటల్ పాలసీలు పెరిగాయి. మిగిలిన పెద్ద ఇన్సూరెన్స్ సంస్థలు సైతం ఈ బాటలోనే పయనిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్,హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, మాక్స్ లైఫ్ వంటి భీమా సంస్థలు పాలసీబజార్‌తో కలిసి టెలి-మెడికల్ సేవలను మెరుగుపరుస్తున్నాయి.
‘మెడికల్ సెంటర్లపై భారాన్ని తగ్గించడానికి నేరుగా వెళ్లి మెడికల్ చెకప్ చేసుకోకుండా పలసీబజార్ హెల్త్ అండ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ని అందిస్తోంది. ఫోన్‌లోనే మెడికల్ చెకప్‌తో పాలసీదారుడు రూ. 2 కోట్ల వరకు టర్మ ప్లాన్‌ని, రూ. కోటి వరకు హెల్త్ కవరేజీని పొందవచ్చు’ అని పాలసీబజార్‌లో జీవిత భీమా బిజినెస్ ఆఫీసర్ సంతోష్ అగర్వాల్ చెప్పారు. కరోనా వ్యాప్తి వల్ల నేరుగా మెడికల్ కేంద్రాలను సందర్శించాల్సి అవసరాన్ని గుర్తించి కస్టమర్ల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి భీమాదారులతో పాటు వైద్యులు, ఆరోగ్య నిపుణుల సంఖ్యను పెంచాలనే యోచనలో సంస్థలు ఉన్నాయని తెలుస్తోంది.
‘ప్రస్తుత పరిస్థితుల్లో భీమా కవరేజీని కొనుగోలు చేయడానికి ప్రీ-మెడికల్ పరీక్షలు చేయడం కష్టమైన పని. వైద్య పరీక్షల్లోకి వచ్చే కేసులను పరిశీలిస్తున్నాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సాధారణ ఈ వర్గంలోకి వచ్చే కేసులు 15 శాతం కన్నా తక్కువ’ అని రహేజా జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో పంకజ్ అరోరా చెప్పారు. ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ద్వారా తక్కువ ఖర్చు, సౌలభ్యం ఉండవచ్చు. ఏదైనా సమాచాం ఇవ్వడంలో పొరపాటు దొర్లితే పాలసీని క్లైం చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి, పాలసీదారులు కొత్త పాలసీని తీసుకోవాలనుకుంటే, టెలి-మెడికల్ ప్రక్రియలో అన్నీ ఖచ్చితమైన సమాచారాన్ని బహిర్గత చేసేలా నిర్ధారించుకోవాలి. కస్టమర్ తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దర్యాప్తులో గనక రుజువైతే పాలసీ తిరస్కరించే హక్కు భీమా సంస్థకు ఉంటుందని పాలసీబజార్‌కు చెందిన అగర్వాల్ హెచ్చరించారు.
కోవిడ్ -19 ప్రభావం :
అవకతవకలు లేని సేవలను అందించడానికి పాలసీ హోల్డర్లకు తగిన సేవలందించేందుకు భీమా సంస్థలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. విధాన పునరుద్ధరణ, దావాల పరిష్కారం, ఇత అవస్రమైన సమాచారాలకు సంబంధించి సహాయం కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని వినియోగదారుల సందేహాలు తీరుస్తున్నట్టు సంబంధిత వర్గాల వారు చెబుతున్నారు.
త్వరలో కొన్ని సంస్థలు వినియోగదారుల కోసం హోమ్ హెల్త్ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. గో యాక్టివ్ వంటి ప్రణాళికలు ఇప్పటికే టెలి-మెడిసిన్, సైకాలాజికల్ కౌన్సిలింగ్ అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న సమయంలో ఈ ప్రక్రియ సందర్భోచితంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
స్టార్ హెల్త్ సంస్థ ‘స్టార్ నోవల్ కరోనావైరస్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది. ఇది కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న వారందరినీ ఇది కవర్ చేస్తుంది. ఇప్పటికే ఉన్న పాలసీల కోసం కోవిడ్-19ను కవర్ చేయమని ఐఆర్‌డీఏ అని భీమా సంస్థలకు సూచించింది.
Tags: life and health insurance, policies, Policybazaar, HDFC Ergo Health Insurance, Religare, Max Bupa, HDFC life, Max Life