- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే నెలలో 39 మొబైల్ ఫోన్స్ చోరీ.. వాల్యూ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నెల వ్యవధిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 39 సెల్‌ఫోన్స్ దొంగిలించారు దుండగులు.. పరిగి పట్టణంలోని ఫ్లిప్ కార్డు (flipkart ) ఆఫీసులో కష్టమర్లు బుక్ చేసిన రూ. 7,50,000 విలువ చేసే 39 సెల్ ఫోన్లు దొంగిలించినట్టు తెలిసింది. ఇటీవల ఫ్లిప్ కార్డులో డెలివరీ కోసం వచ్చిన మొబైల్స్ వరుసగా మాయమవుతూ వచ్చాయి. గత నవంబర్ నెల నుంచి ముందుగా 37 సెల్ఫోన్లు మాయం అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. ఫ్లిప్‌కార్టులో ఆర్డర్ చేసిన మొబైల్స్ కస్టమర్లకు చేరకుండానే ఎలా పోతున్నాయని డెలివరీ బాయ్స్‌ను ప్రశ్నించగా తమకేమీ తెలీదని వారు సమాధానం ఇచ్చారు. కస్టమర్లు కాల్ చేసి ఎక్కడ డెలివరీ చేయాల్లో చెబితే తాము అక్కడే చేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ ఇన్చార్జికి చెప్పారు అందులో పనిచేస్తున్న 17 మంది డెలివరీ బాయ్స్..
దొంగిలించిన సెల్ఫోన్లు తెచ్చి ఇవ్వకుంటే పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేస్తానని యజమాన్యం బెదిరించడంతో ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. సమస్య పోలీస్టేషన్‌కు వెళితే తమ పరువు పోతుందని, చేయని నేరం తమపై వస్తుందని.. అసలు దొంగ దొరకగానే మీరిచ్చిన డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి 17 మంది డెలివరీ బాయ్స్ ఒక్కొక్కరి దగ్గర 26 వేలు, 20 వేలు డబ్బులు లేని కొందరు తమ బైకులపై ఫైనాన్స్ తీసుకుని మరి రూ. 3లక్షల పదిహేడు వేలు 3,17,000 ఫ్లిప్ కార్టు యజమాన్యానికి చెల్లించారు.
ఫ్లిప్ కార్డు యజమాన్యం ఇన్చార్జి శ్రీనివాస్ 37 సెల్ఫోన్ల పోయిన తర్వాత వెంటనే ఆఫీసులో సీసీ కెమెరాలు బిగించారు. ఫ్లిప్‌కార్డ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు రెండు సెల్ఫోన్ దొంగిలిస్తుండగా సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఇన్చార్జి శ్రీనివాస్. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు 39 సెల్ఫోన్లు ఎవరు దొంగిలించారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. డెలివరీ బాయ్స్ దొంగిలించారా? లేదా వేరే ఎవరైనా దుండగులు దొంగిలించారా? దొంగిలించిన సెల్ఫోన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఏ సెల్ఫోన్ టవర్ లోకేషన్ల దగ్గర పని చేస్తున్నాయనే కోనంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.