యోధులకు ఏది టీకా..?

by Shamantha N |
యోధులకు ఏది టీకా..?
X

న్యూఢిల్లీ : కరోనాపై పోరులో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. 3 కోట్ల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందిలో 37 శాతం మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేసుకున్నారు. జనవరి 26న దేశంలోని ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, తమకు వ్యాక్సిన్ కావాలని దేశవ్యాప్తంగా 2.36 కోట్ల మంది వైద్య సిబ్బంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్న వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లను పరిగణనలోకి తీసుకుంటే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారు 47 శాతానికి మించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని సమీకరించి సరైన సమయానికి టీకాలు అందించకపోవడం వల్లే కరోనా యోధులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story