- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ నుంచి తబ్లిఘీకు 369 మంది హాజరు
ఢిల్లీలోని హజరత్ నిజామాబుద్దీన్‌లో నిర్వహించిన తబ్లిఘీ జమాత్‌లో పాల్గొన్న పలువురు కరోనాతో మృతిచెందడం, మరికొందరికి వైరస్ సోకడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తబ్లిఘీకి ఎవరెవరు హాజరయ్యారు అనే విషయమై ఆరా తీస్తున్నాయి. మంగళవారం ఆంధ్రప్రదేశ్ నుంచి తబ్లిఘీకు హాజరైన వారి వివరాలతో కూడిన జాబితాను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 369 మంది పాల్గొన్నట్లు సమాచారం. అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 107 మంది హాజరు కాగా, శ్రీకాకుళం నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. విజయనగరం నుంచి అత్యల్పంగా 3, విశాఖపట్నం నుంచి 14 మంది హాజరయ్యారు.
హజారత్ నిజాముద్దీన్ మసీద్‌లో మౌలానా సాద్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా తబ్లిఘీ జరుగుతుంది. తబ్లిఘీ జమాత్ ఆర్గనైజేషన్ సభ్యులు మసీదును సందర్శించి ఇస్లాం గురించి, ప్రతి రోజు నమాజ్ చేయడంపై ప్రసంగాలు చేస్తారు. ఈ ఏడాది మార్చి 15 మధ్యాహ్నం నుంచి 17 వరకు తబ్లిఘీ జమాత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 1500 నుంచి 2000 మంది హాజరైనట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ బృందానికి హైదరాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఇక్రామ్ అలీ సారథ్యం వహించారు. మార్చి 17న కార్యక్రమం ముగియగానే ఏపీ, తెలంగాణకు చెందిన వారు రైలు మార్గాన స్వగ్రామాలకు చేరుకున్నారు.
Tags: corona out break, Hazarat Nizamudddin delhi, Tablighi, 369 members attend to this programm from ap